రాయలసీమ న్యూస్ - నంద్యాల
నంద్యాల జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గోపాల్ రావు ఇంటిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ACB అధికారులు కర్నూలు సమీపంలోని పెద్దపాడు మైత్రి హోంలో గురువారం ఉదయం నుంచి సోదాలు కొనసాగిస్తున్నారు. డిఎస్పీ సీత రామరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సోదాల్లో గదులు, పత్రాలు, బ్యాంకు ఖాతాలు, విలువైన వస్తువులను పరిశీలిస్తూ, స్వాధీనం చేసిన ఆస్తుల వివరాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలపై నిర్ణయం తీసుక
నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ సోదాలు నంద్యాల జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గోపాల్ రావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు నిర్వహిస్తున్నారు. కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద ఉన్న మైత్రి హోంలో ఆయన నివాసంలో గురువారం ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
గోపాల్ రావు వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారం ఆధారంగా సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. మైత్రి హోంలో ఆయన నివాసంలో గదులు, అల్మారాలు, డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాల వివరాలు, విలువైన వస్తువులు తదితరాలను అధికారులు పరిశీలిస్తున్నారని సమాచారం.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి