రాయలసీమ న్యూస్ - కడప

అగస్త్యేశ్వర ఆలయంలో మాస శివరాత్రి వైభవం

ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకాలు, గోపూజ, రుద్ర హోమాలు, ఆర్జిత కల్యాణోత్సవం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి దర్శనానికి పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి శివనామస్మరణలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.

అగస్త్యేశ్వర ఆలయంలో మాస శివరాత్రి వైభవం ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. వేడుకలలో భాగంగా ఉదయం స్వామివారికి విశేష రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు శాస్త్రోక్త విధానంలో నిర్వహించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →