రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
స్థానిక అగస్త్యేశ్వరాలయం నిధులు, వెండి ఆభరణాల దుర్వినియోగంపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని శివభక్తులు ఆలయ చైర్మన్ నారాయణరెడ్డి, ఈవో రమణకు వినతిపత్రం సమర్పించారు. గత అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా సుమారు కోటి రూపాయలు మాయమయ్యాయని ఆరోపిస్తూ, నిధుల రికవరీ, పారదర్శక పరిపాలన, కఠిన నియంత్రణలు కోరిన భక్తులు, డిమాండ్లు పట్టించుకోకపోతే ఉద్యమం, చలో విజయవాడ కార్యక్రమానికి సిద్ధమని హెచ్చరించారు.
అగస్త్యేశ్వరాలయం నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్ స్థానిక అగస్త్యేశ్వరాలయం నిధులు, ఆభరణాలు దుర్వినియోగానికి గురైన విషయంపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని శివభక్తులు డిమాండ్ చేశారు. ఆలయానికి చెందిన సొమ్మును దోచుకున్నవారిని శిక్షించాలని కోరుతూ గురువారం భక్తుల బృందం ఆలయ చైర్మన్ నారాయణరెడ్డి, ఈవో రమణను కలిసి వినతి పత్రం సమర్పించింది.
శివయ్యకు చెందిన వెండి ఆభరణాలు, ఆలయ బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ. కోటి నిధులు గతంలో బాధ్యతలు నిర్వహించిన అధికారుల కాలంలో మాయమైనట్లు భక్తులు ఆరోపించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి