రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆదాయం గత నెలలో గణనీయంగా పెరిగిందని మార్కెటింగ్ శాఖ జిల్లా ఏడి నరేంద్ర తెలిపారు. వ్యాపారుల సౌలభ్యం కోసం అమలు చేస్తున్న e-ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానం వల్ల మొత్తం రూ.1.71 కోట్లు, అందులో ప్రొద్దుటూరు AMC నుంచి రూ.21.24 లక్షలు వసూలయ్యాయని, ఈ డిజిటల్ విధానం వల్ల పారదర్శకత, సమయం, ఖర్చు ఆదా అవడంతో రాబోయే నెలల్లో ఇంకా రాబడి పెరుగుతుందనే అంచనాలు వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆదాయం పెరుగుదల ప్రొద్దటూరు:- జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల రాబడి గత నెలలో గణనీయంగా పెరిగిందని మార్కెటింగ్ శాఖ జిల్లా ఏడి నరేంద్ర తెలిపారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కొత్త విధానాల వల్ల ఆదాయంలో ఈ పెరుగుదల నమోదైందని ఆయన వివరించారు.
గత నెల నుంచి మార్కెటింగ్ శాఖలో e-ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానం అమల్లోకి వచ్చిందని ఏడి నరేంద్ర చెప్పారు. ఈ విధానం ప్రారంభమైన తర్వాత మొదటి నెలలోనే మంచి ఫలితాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి