రాయలసీమ న్యూస్ - అనంతపురం
ఏఐఎస్‌బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వి ఆగస్టు 24, 25 తేదీల్లో నెల్లూరులో జరగనున్న రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యావ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని, జీవో 77 రద్దు, రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, సంక్షేమ హాస్టళ్లలో మెస్, కాస్మొటిక్ ఛార్జీల పెంపు, ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వంటి డిమాండ్లపై విద్యార్థి ఉద్యమాలకు ఈ ప్లీనరీ వేదికగా ఉ
ఏఐఎస్‌బీ రాష్ట్ర ప్లీనరీ విజయవంతం చేయాలని పిలుపు అనంతపూర్:- ఆగస్టు 24, 25 తేదీల్లో నెల్లూరు నగరంలో జరగనున్న అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏఐఎస్‌బీ) రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఏఐఎస్‌బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వి పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్లీనరీ సమావేశాల కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పృథ్వి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యావ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని, కార్పొరేట్ విద్యకు ప్రోత్సాహం ఇస్తూ సాధారణ విద్యార్థుల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 77ను రద్దు చేసి పేద విద్యార్థులకు ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి