రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ ఆందోళన

కడప కలెక్టరేట్ వద్ద కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. కార్మికులను పర్మినెంట్ చేయడం, కనీస వేతనం 26 వేలుగా నిర్ణయించడం, కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయడం, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ ఆందోళన కడప: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించిన ఉద్యమకారులు తరువాత కార్యాలయం లోపలికి చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ఉద్యమకారులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →