రాయలసీమ న్యూస్ - తిరుపతి
అమర రాజా సంస్థ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ అమర హాస్పిటల్ భాగస్వామ్యంతో వార్షిక వైద్య పరీక్షలు–2026ను ప్రారంభించింది. ఈసారి 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్య మార్పులను అంచనా వేసే ‘వైటాలిటీ ఇండెక్స్’ ను ప్రవేశపెట్టి, దేశవ్యాప్తంగా 24,020 మంది ఉద్యోగులకు ఐదు తయారీ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
అమర రాజా ఉద్యోగులకు వార్షిక వైద్య పరీక్షలు ప్రారంభం ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం, నివారణాత్మక వైద్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ అమర రాజా సంస్థ వార్షిక వైద్య పరీక్షలు–2026ను అమర హాస్పిటల్ భాగస్వామ్యంతో బుధవారం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసి, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ ఏడాది తొలిసారిగా 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న ఉద్యోగులకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ప్రవేశపెట్టారు. వయస్సు పెరుగుతున్న ఉద్యోగుల్లో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి