రాయలసీమ న్యూస్ - అనంతపురం
అనంతపురం జిల్లాలో రాత్రి వేళల్లో ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం పోలీసులు “ఆపరేషన్ నైట్ సేఫ్టీ” పేరుతో విస్తృత తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు, చెక్‌పోస్టులు, లాడ్జీలు, హోటళ్ల వద్ద వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులపై దృష్టి పెట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కట్టుదిట్టం చేస్తూ, ప్రజలు అనుమానాస్పద కదలికలు గమనిస్తే డయల్ 100, 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు
అనంతపురం జిల్లాలో “ఆపరేషన్ నైట్ సేఫ్టీ” ముమ్మరం అనంతపురం జిల్లా వ్యాప్తంగా రాత్రి వేళల్లో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు “ఆపరేషన్ నైట్ సేఫ్టీ” పేరుతో ప్రత్యేక తనిఖీలను ముమ్మరం చేశారు. జగదీష్, IPS ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
జిల్లాలోని ప్రధాన రహదారులు, పట్టణాలు, గ్రామాల్లో ముఖ్యంగా రాత్రి సమయంలో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రధాన జంక్షన్లు, సరిహద్దు చెక్‌పోస్టులు, సమస్యాత్మక ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి విచారణ చేపట్టారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి