రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి
శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో 'చలో కలెక్టరేట్ ’ధర్నాకు సంబంధించి పెనుకొండలో AP అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ , CITU ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు వేతనాలు, సేవా నిబంధనలు, ఇతర హక్కుల సమస్యల పరిష్కారానికి ఈ ధర్నా నిర్వహిస్తున్నట్టు యూనియన్ నాయకులు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్‌వాడీ వర్కర్ల భారీ ధర్నా పిలుపు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని CDPO కార్యాలయం వద్ద AP అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ , CITU ఆధ్వర్యంలో రేపు జరగనున్న కలెక్టరేట్ ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. జూలై 31న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ఈ ధర్నాకు జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీగా తరలివచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని యూన
కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో పెనుకొండ ప్రాజెక్ట్ కార్యదర్శి భావమ్మ, కోశాధికారి మాబున్నీసా తదితరులు పాల్గొన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ ధర్నాను నిర్వహిస్తున్నట్టు వారు వివరించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి