రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచాలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై ACB అధికారులు దాడులు నిర్వహించి SRO, సిబ్బంది వద్ద నుంచి రూ.1.25 లక్షలు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కడప ACB DSP సీతారాం లంచం అడిగిన సందర్భంలో తన నంబర్ 9440446191కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతూ, ప్రతి ఫిర్యాదుపై కఠినంగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు అన్నమయ్య : అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
దాడుల సందర్భంగా SRO, సిబ్బంది వద్ద అనధికారికంగా ఉన్న నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.25 లక్షలు సీజ్ చేసినట్లు కడప ACB DSP సీతారాం వెల్లడించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి