రాయలసీమ న్యూస్ ఎడ్యుకేషన్ డెస్క్

MBBS, BDS కౌన్సెలింగ్‌ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన ఏపీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం MBBS, BDS ప్రవేశాల కౌన్సెలింగ్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ 2004 ప్రవేశాల నియమాలను సవరించింది. ఇకపై ప్రతి దశ కౌన్సెలింగ్‌కు ముందు అభ్యర్థులు కొత్తగా వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చు, మధ్యలో మంజూరయ్యే సీట్లను కూడా అదే దశలో భర్తీ చేస్తారు.

కేటాయించిన సీటులో చేరకపోయినా, అదే కాలేజీకి మాత్రమే తరువాతి దశల్లో ఆప్షన్ ఇవ్వలేరు గానీ, ఇతర కాలేజీలకు అవకాశం కొనసాగుతుంది. MBBS, BDS కౌన్సెలింగ్‌ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన ఏపీ ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్య ప్రవేశాల కౌన్సెలింగ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.

MBBS, BDS అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇప్పటివరకు అమలులో ఉన్న కౌన్సెలింగ్ నిబంధనలను సవరిస్తూ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ తాజా జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ s (UG మెడికల్ అండ్ డెంటల్ ప్రొఫెషనల్ కోర్సెస్ అడ్మిషన్స్ ) రూల్స్ , 2004లో మార్పులు చేశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →