రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి అధికారిక ప్రక్రియను ప్రారంభించింది. BCలకు 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టంచేసి, వాటికి అనుగుణంగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ కేటాయింపు పనులు మొదలుపెట్టింది.
ఈ నిర్ణయంతో ఎన్నికల షెడ్యూల్, నామినేషన్లు, ప్రచార కాలం, ఓటింగ్ తేదీలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉండగా, రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచాయి. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సంబంధిత శాఖలకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైనట్టైంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి