రాయలసీమ న్యూస్ - కర్నూలు

రైతులకు ఏపీఎస్పీడీసీఎల్ కొత్త సౌకర్యం: సిఎండి

ఏపీఎస్పీడీసీఎల్ వ్యవసాయ విద్యుత్ సర్వీసు దరఖాస్తుల సీనియారిటీ, ప్రస్తుత స్థితి తెలుసుకునేందుకు మొబైల్ యాప్ ద్వారా కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దరఖాస్తు నంబర్ నమోదు చేస్తే సర్వీసు స్థితి వెంటనే స్క్రీన్‌పై కనిపించేలా వ్యవస్థను రూపొందించారు.

స్మార్ట్‌ఫోన్ లేని రైతులు తమ ప్రాంత విద్యుత్ కార్యాలయాల్లో దరఖాస్తు నంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని సంస్థ తెలిపింది. రైతులకు ఏపీఎస్పీడీసీఎల్ కొత్త సౌకర్యం: సిఎండి రైతుల కోసం వ్యవసాయ విద్యుత్ సర్వీసు దరఖాస్తుల వివరాలు తెలుసుకునే కొత్త సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ సథరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఏపీఎస్పీడీసీఎల్) అందుబాటులోకి తీసుకువచ్చింది.

సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యవసాయ విద్యుత్ సర్వీసు కోసం దరఖాస్తు చేసిన రైతులు ఇకపై తమ దరఖాస్తుల సీనియారిటీ, ప్రస్తుత స్థితి వంటి వివరాలను ఏపీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →