రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లు అందుబాటులో లేని సందర్భాల్లో సభను నడిపేందుకు ప్యానల్ స్పీకర్లను సభాపతి నియమించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, మండలి బుద్ధప్రసాద్, కోళ్ల లలితకుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్ రాజు ఈ ప్యానల్‌లో ఉండగా, సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు, క్రమశిక్షణ పాటించేందుకు వీరి పాత్ర కీలకమని అసెంబ్లీ వర
అసెంబ్లీకి ప్యానల్ స్పీకర్ల నియామకం ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో సభా నిర్వహణ కోసం ప్యానల్ స్పీకర్లను సభాపతి సోమవారం ప్రకటించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేని సందర్భాల్లో సభా కార్యక్రమాలను సజావుగా కొనసాగించేందుకు ఈ ప్యానల్ స్పీకర్లను నియమించినట్లు అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.
సభాపతి ప్రకటించిన వివరాల ప్రకారం, ప్యానల్ స్పీకర్లుగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, మండలి బుద్ధప్రసాద్, కోళ్ల లలితకుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్ రాజును ఎంపిక చేశారు. వీరు అవసరమైనప్పుడు సభను నిర్వహించే బాధ్యతలు చేపడతారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి