రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతి అలిపిరి–జూ పార్క్ రోడ్డుకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో చిత్తూరు సంతపేటకు చెందిన ఆటో డ్రైవర్ పురుషోత్తం (34) అప్పుల బాధ, బ్యాంకు సిబ్బంది వేధింపుల కారణంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, అప్పులు, బ్యాంకు సిబ్బంది వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు.
అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఉరి – బ్యాంకు సిబ్బంది వేధింపుల ఆరోపణ తిరుపతి నగర పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. అలిపిరి–జూ పార్క్ రోడ్డుకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో ఒక ఆటో డ్రైవర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనతో స్థానిక ప్రాంతంలో దిగ్భ్రాంతి నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చిత్తూరు టౌన్ సంతపేటకు చెందిన పురుషోత్తం (34)గా మృతుడిని గుర్తించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి