రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
బద్వేల్ టౌన్‌లో చికెన్ షాపుల వద్ద వాహనాలు రోడ్డుపైనే నిలిపివేయడంతో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలపై సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. షాప్ యజమానులకు వాహనాల పార్కింగ్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, కస్టమర్లను చైతన్యపరచాలని సూచించారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ న్యూసెన్స్‌కు పాల్పడుతున్న వారిపై న్యూసెన్స్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. బద్వేల్‌లో చికెన్ షాపుల వద్ద ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు బద్వేల్ టౌన్‌లో చికెన్ షాపుల వద్ద వాహనాల నిలుపుదల కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలపై పోలీసులు చర్యలు ప్రారంభించారు.
బద్వేలు సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. టౌన్‌లోని ఫోర్ రోడ్స్ సర్కిల్ నుండి ఆర్‌టీసీ బస్టాండ్ వరకు ఉన్న చికెన్ షాప్ యజమానులను సీఐ రామకృష్ణ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి