రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

బద్వేల్‌లో ఇన్ఛార్జ్‌ను పక్కనబెట్టి మాజీ MLA వర్గం పవర్ షో

కడప జిల్లా బద్వేల్‌లో తెలుగు దేశం పార్టీ అంతర్గత విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అధికారిక ఇన్ఛార్జ్ సూర్య నారాయణ రెడ్డిని పక్కనబెట్టి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గం కోడిగుడ్లపాడులో కూటమి ప్రభుత్వ పథకాలపై భారీ ప్రచార కార్యక్రమం నిర్వహించడంతో ఇది పవర్ షోగా భావించాలా అనే చర్చ మొదలైంది.

ఈ పరిణామాలు బద్వేల్ టీడీపీ భవిష్యత్ దిశపై ప్రభావం చూపవచ్చని స్థానిక రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బద్వేల్‌లో ఇన్ఛార్జ్‌ను పక్కనబెట్టి మాజీ MLA వర్గం పవర్ షో కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత రాజకీయాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.

బద్వేల్ నియోజకవర్గం కాశీనాయన మండలం కోడిగుడ్లపాడు గ్రామంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని స్థానిక నాయకులు నిర్వహించారు. ‘రెండేళ్ల నమ్మకం సంక్షేమం, అభివృద్ధి’ పేరుతో చేపట్టిన ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గానికి చెందిన నేతలు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించినట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →