రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

చిన్న వర్షానికే చెరువుల్లా మారుతున్న బద్వేల్ నెల్లూరు రోడ్

బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు రోడ్, National Highway 67 పై చిన్న వర్షానికే నీరు నిలిచిపోవడంతో రహదారులు చెరువుల్లా మారి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూసుకుపోయిన డ్రైనేజీలు, పేరుకుపోయిన చెత్త కారణంగా నీటి పారుదల లేక దుర్వాసన, ప్రమాదాల భయం పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

చిన్న వర్షానికే చెరువుల్లా మారుతున్న బద్వేల్ నెల్లూరు రోడ్ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు రోడ్, నేషనల్ హైవే 67 పై వర్షం పడితే చాలు రోడ్లు చెరువుల్లా మారిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీలు మూసుకుపోవడంతో వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోవడం, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది.

బద్వేల్ పట్టణంలో ప్రధాన రహదారిగా భావించే నెల్లూరు రోడ్, నేషనల్ హైవే 67 ప్రాంతంలో వర్షాకాలం మొదలైనప్పటి నుంచి సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. చిన్నపాటి జల్లులు కురిసినా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణాలు కష్టసాధ్యంగా మారుతున్నాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →