రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడపలో రాష్ట్ర మంత్రి బి.సి జనార్ధన్ రెడ్డి, జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసుల రెడ్డి స్వగృహంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఇంచార్జీలతో సమావేశమై రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పనులు, పార్టీ బలోపేతంపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల సమస్యలు, మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, బూత్ స్థాయిలో పార్టీ శక్తిని పెంచే చర్యలపై చర్చించి, సమన్వయంతో పనిచేయాలని నాయకత్వం సూచించినట్లు పార్టీ వర్
కడపలో ఎమ్మెల్యేలతో సమావేశమైన రాష్ట్ర మంత్రి బి.సి జనార్ధన్ రెడ్డి కడప జిల్లా రాజకీయ, అభివృద్ధి అంశాలపై రాష్ట్ర మంత్రివర్యులు బి.సి జనార్ధన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కడప పట్టణంలో జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసుల రెడ్డి స్వగృహంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఇంచార్జీలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి ముందు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, రాష్ట్ర మంత్రివర్యులు బి.సి జనార్ధన్ రెడ్డిని కలిసి జిల్లా పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. అనంతరం జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసుల రెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంలో జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి పనుల పురోగతి, పార్టీ బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి