రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరులోని ఓంశాంతి భవన్‌లో దాది ప్రకాష్ మణి పుణ్యస్మృతి దినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించి, స్థానికులు, యువత, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. అవసరమైన సమయంలో రక్తం అందక అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరానికి ఒకసారి రక్తదానం చేయాలని BK శాంత పిలుపునిచ్చారు.
రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని పిలుపు ప్రొద్దుటూరు: అవసరమైన సమయంలో రక్తం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో, ఆరోగ్యవంతులైన వారు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఓంశాంతి భవన్ నిర్వాహకురాలు BK శాంత పిలుపునిచ్చారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలు రక్షించవచ్చని ఆమె పేర్కొన్నారు.
ఆదివారం ప్రొద్దుటూరు విజయనగరం వీధిలోని ఓంశాంతి భవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. సంస్థ ప్రథమ అధ్యక్షురాలు తపో మూర్తి దాది ప్రకాష్ మణి పుణ్యస్మృతి దినాన్ని పురస్కరించుకుని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి