రాయలసీమ న్యూస్ - తిరుపతి

చంద్రగిరి మద్యం దుకాణంలో వృద్ధుడి మృతి, అనంతపురం జిల్లా వ్యక్తిగా గుర్తింపు

చంద్రగిరి పట్టణంలోని మద్యం దుకాణంలో మద్యం సేవిస్తున్న అనంతపురం జిల్లా కదిరికి చెందిన వెంకటేశ్ అనే వృద్ధుడు అకస్మాత్తుగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతికి గల కారణం పోస్టుమార్టం నివేదిక వెలువడిన తర్వాతే తెలిసే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. చంద్రగిరి మద్యం దుకాణంలో వృద్ధుడి మృతి, అనంతపురం జిల్లా వ్యక్తిగా గుర్తింపు చంద్రగిరి: చంద్రగిరి పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో సోమవారం సాయంత్రం వృద్ధుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందిన ఘటన స్థానికులను కలవరపరిచింది.

మద్యం సేవించేందుకు వచ్చిన ఆ వృద్ధుడు కొద్దిసేపు అక్కడే కూర్చొని మద్యం తాగుతూ ఉండగా, ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రారంభంలో అతడు మద్యం మత్తులోనే కిందపడిపోయాడని అక్కడున్న కొంతమంది భావించినట్లు సమాచారం.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →