రాయలసీమ న్యూస్ - అన్నమయ్య

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన

మదనపల్లె కలెక్టరేట్ ఎదుట జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మికులు నిరసన నిర్వహించి, చేనేత రంగం క్షీణతతో జీవనోపాధి దెబ్బతింటోందని, ఇళ్లలో ఉన్న విద్యుత్ మీటర్ల వల్ల అధిక బిల్లులు వచ్చి ఆర్థిక భారంతో నలుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్, నేతన్న నేస్తం పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందేలా చేసి, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వాన్న

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన మదనపల్లె గ్రామీణం: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌ ఎదుట చేనేత కార్మికులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు నాగరాజు, జిల్లా ప్రచార కార్యదర్శి వీరాంజనేయులు పాల్గొన్నారు.

చేనేత రంగం రోజురోజుకూ కష్టాల్లో కూరుకుపోతున్న నేపథ్యంలో కార్మికుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చేనేత కార్మికుల ఇళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ మీటర్ల కారణంగా అధిక బిల్లులు వస్తున్నాయని, దీనివల్ల కుటుంబాలు ఆర్థిక భారంతో నలుగుతున్నాయని పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →