రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ప్రొద్దుటూరులో అన్నదాన సేవా కార్యక్రమం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా వై.ఎస్.ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమంలో మెగా అభిమానులు అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించారు. ప్రొద్దుటూరు పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు, పేదలకు భోజనం వడ్డించి సేవ చేయడంతో పాటు చిరంజీవి, ఆయన కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసి ప్రార్థనలు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ప్రొద్దుటూరులో అన్నదాన సేవా కార్యక్రమం వై.ఎస్.ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల సందర్భంగా మెగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానికంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఈ కార్యక్రమాల భాగంగా నేడు ప్రొద్దుటూరులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆశ్రమానికి వచ్చిన భక్తులు, పేదలకు అభిమానులు స్వయంగా భోజనాన్ని వడ్డించి సేవ చేశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →