రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల సందర్భంగా ప్రొద్దుటూరులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమంలో మెగా అభిమానులు అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, పేదలకు స్వయంగా భోజనం వడ్డిస్తూ, చిరంజీవి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.
చిరంజీవి అభిమాన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు పొందింది. మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ప్రొద్దుటూరులో అన్నదాన సేవా కార్యక్రమం పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల సందర్భంగా ప్రొద్దుటూరులోని మెగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
జన్మదిన వేడుకలను సేవా దినంగా మార్చుకుంటూ స్థానికంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో నేడు ప్రొద్దుటూరులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి