రాయలసీమ న్యూస్ - అనంతపురం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను జనసేన పార్టీ బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించి, రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. చిరంజీవి సేవా కార్యక్రమాలు, రక్తదానం, నేత్రదానం ప్రోత్సాహం, ప్రకృతి విపత్తులు, కరోనా సమయంలో చేసిన సేవలను నాయకులు కొనియాడుతూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కళ్యాణదుర్గంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి, అక్కడి రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు.
కళ్యాణదుర్గం జనసేన పార్టీ తరఫున చిరంజీవికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్వయంకృషితో సినీ రంగంలో అగ్రస్థానానికి ఎదిగి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి సేవా కార్యక్రమాలతోనూ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారని నాయకులు పేర్కొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి