రాయలసీమ న్యూస్ - చిత్తూరు
చిత్తూరు చవటపల్లి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పంపిణీ చేస్తున్న పాల నాణ్యతపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలు రంగు, వాసన, రుచి సహజంగా లేక గడ్డకట్టినట్టుగా కనిపించడం వల్ల పిల్లల ఆరోగ్యానికి ముప్పు ఉందని వారు భావిస్తూ, పాల ప్యాకెట్లను పరీక్షించి లోపాలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార నాణ్యతపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని డిమ
చిత్తూరు చవటపల్లి అంగన్వాడీ కేంద్రంలో పాల నాణ్యతపై కలకలం చిత్తూరు పట్టణంలోని 50వ వార్డు చవటపల్లి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పాల నాణ్యతపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు పంపిణీ చేసిన పాల ప్యాకెట్లు దుస్థితిలో ఉన్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పాలు రంగు, వాసన, రుచి సహజంగా లేక గడ్డకట్టినట్టుగా కనిపించడం వల్ల చిన్నారుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందేమోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. చవటపల్లి అంగన్వాడీ కేంద్రానికి పంపిన పాల ప్యాకెట్లలో కొన్నింటి పాలు సాధారణంగా ఉండే తెల్లని రంగు కాకుండా మసకబారినట్టుగా కనిపించాయని, వాసన కూడా సహజంగా లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి