రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

పట్టణంలో మద్యం దుకాణాలపై కాంగ్రెస్ ఫిర్యాదు

పులివెందుల నియోజకవర్గంలో పట్టణంలోని బ్రాందీ షాపులు ప్రభుత్వం నిర్ణయించిన సమయాలకు విరుద్ధంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. యువతకు మద్యం సులభంగా అందుబాటులోకి రావడం వల్ల సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంటూ, నిబంధనలు ఉల్లంఘించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుని, అవసరమైతే లైసెన్సులు రద్దు చేయాలని వా

పట్టణంలో మద్యం దుకాణాలపై కాంగ్రెస్ ఫిర్యాదు పట్టణంలో బ్రాందీ షాపులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణీత సమయాలు పాటించకుండా నిర్వహిస్తున్నారంటూ పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ధృవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. మద్యం విక్రయాలపై అమల్లో ఉన్న నియమాలను పట్టించుకోకుండా షాపులు పనిచేస్తున్నాయని వారు ఆరోపించారు.

ఉదయం 6 గంటల నుంచే బ్రాందీ షాపులు తెరిచి, రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు సాగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్ణీత పనివేళలకు మించి దుకాణాలు కొనసాగడం వల్ల ప్రజలకు, ముఖ్యంగా యువతకు మద్యం సులభంగా అందుబాటులోకి వస్తోందని, దీనివల్ల సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →