రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతిలో రోడ్లు, కాలువలు దయనీయ స్థితిలో ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని CPI నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎం.ఆర్.పల్లి సీతమ్మనగర్‌లో నిర్వహించిన ‘మార్పు కోసం పాదయాత్ర’లో పేదలకు ఇంటి పట్టాలు, రెండు సెంట్ల స్థలం కేటాయింపు, బస్తీలలో మౌలిక వసతుల మెరుగుదల కోసం ప్రభుత్వం, అధికారులను చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తిరుపతిలో రోడ్లు, కాలువలు సరిదిద్దాలని సీపీఐ డిమాండ్ తిరుపతి నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, కాలువలను తక్షణమే బాగు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (CPI) నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండటం, కాలువలు మూసుకుపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.
మంగళవారం తిరుపతి ఎం.ఆర్.పల్లి సీతమ్మనగర్‌లో CPI ఆధ్వర్యంలో ‘మార్పు కోసం పాదయాత్ర’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు, జిల్లా కార్యదర్శి పి.మురళీ పాల్గొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి