రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు అమృతనగర్ కాలనీలో విద్యుత్ లైన్లు పూర్తిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు, సీపీఎం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇళ్ల పట్టాలు, పక్కా ఇళ్లు ఇచ్చినా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడం వల్ల పిల్లల చదువులు, తాగునీటి సరఫరా, గృహ అవసరాలు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రతి ఇంటికి శాశ్వత, సురక్షిత విద్యుత్ సదుపాయం కల్పించాలని కోరా
అమృతనగర్‌కు పూర్తి విద్యుత్ లైన్లు వేయాలంటూ సీపీఎం ధర్నా ప్రొద్దుటూరు పట్టణంలో అమృతనగర్ కాలనీలో విద్యుత్ సదుపాయాల లేమిపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ప్రొద్దుటూరు విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో వారు ధర్నా నిర్వహించారు.
కాలనీలో నివసిస్తున్న మహిళలు, పురుషులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమృతనగర్ కాలనీకి ఇప్పటికీ పూర్తి స్థాయిలో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి