రాయలసీమ న్యూస్ - చిత్తూరు

పుత్తూరులో శ్రీ ద్రౌపతీ సమేత ధర్మరాజు స్వామి మహారథోత్సవం వైభవంగా

తిరుపతి జిల్లా పుత్తూరులో శ్రీ ద్రౌపతీ దేవి సమేత ధర్మరాజు స్వామి మహారథోత్సవం శనివారం సాయంత్రం భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ రథోత్సవంలో రథ, గజ, తురగ, పదాతులు, రాజ వేషధారణలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించగా, భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

పుత్తూరులో శ్రీ ద్రౌపతీ సమేత ధర్మరాజు స్వామి మహారథోత్సవం వైభవంగా పుత్తూరు: తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో శ్రీ ద్రౌపతీ దేవి సమేత శ్రీ ధర్మరాజు రాజుల తిరునాళ్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం నిర్వహించిన మహారథోత్సవం భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ మహారథోత్సవం ధర్మరాజు రాజుల తిరునాళ్లలో అత్యంత విశిష్ట ఘట్టంగా భావిస్తారు.

నూతన వస్త్రాలు, విశిష్ట అలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మహారథంపై స్వామివార్లు పురవీధుల్లో విహరించగా, భక్తులు హారతులు పట్టి స్వామివారిని దర్శించుకున్నారు. రథ, గజ, తురగ, పదాతులతో పాటు 20 రకాల రాజ వేషధారణలతో నిర్వహించిన మహారథోత్సవం ఆలయ సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించింది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →