రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఉత్కృష్ట’, ‘అతి ఉత్కృష్ట’ సేవా పతకాలను జిల్లా ఎస్పీ షెమ్మీ నవీకేత్ విశ్వనాథ్ అధికారులకు, సిబ్బందికి ఘనంగా ప్రదానం చేశారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల నిబద్ధతకు గుర్తింపుగానే ఈ పతకాలు లభించాయని ఎస్పీ పేర్కొంటూ, ఇదే స్ఫూర్తితో సేవలు కొనసాగించి పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని
విశిష్ట సేవలకు పోలీసు అధికారులకు సేవా పతకాల ప్రదానం కడప:- పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు, సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఉత్కృష్ట’, ‘అతి ఉత్కృష్ట’ సేవా పతకాలను గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ప్రదానం చేశారు. జిల్లా ఎస్పీ షెమ్మీ నవీకేత్ విశ్వనాథ్ ఈ పతకాలను అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణం పతకాల ప్రదానంతో ఉత్సాహభరితంగా మారింది. ఎంపికైన అధికారులను, సిబ్బందిని ఎస్పీ షెమ్మీ నవీకేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి