రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక”లో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ 142 ఫిర్యాదులను స్వీకరించి, చట్టపరంగా నిర్ణీత గడువులో పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఎలాంటి సంకోచం లేకుండా ఫిర్యాదులు చేయాలని, వారికి చట్టపరమైన న్యాయం అందించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి పనిచేస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు.
ప్రజా ఫిర్యాదులు నిర్ణీత గడువులో చట్టపరంగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సమగ్రంగా వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి, వాటిని సంబంధిత విభాగాల వారీగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ సమాచారం ప్రకారం, మొత్తం 142 ఫిర్యాదులు PGRS ద్వారా స్వీకరించబడ్డాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి