రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి
సత్య సాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ధర్మవరంలో ఆకస్మిక పర్యటన నిర్వహించి శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, రోడ్డు భద్రతా అమలు పరిస్థితులను పరిశీలించారు. వాహన తనిఖీలు, రాత్రి గస్తీ, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా బలోపేతంపై సూచనలు చేస్తూ, మద్యం సేవించి వాహనం నడపరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ₹10,000 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.
ధర్మవరంలో శాంతిభద్రతల పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సత్య సాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ సోమవారం రాత్రి ధర్మవరం పట్టణంలో ఆకస్మిక పర్యటన నిర్వహించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డు భద్రతా చర్యల అమలు పరిస్థితులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
మొదట వన్‌టౌన్ సర్కిల్ వద్ద జరుగుతున్న వాహన తనిఖీలను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. వాహనదారుల వివరాలను పోలీసులు నమోదు చేస్తున్న విధానం, తనిఖీల నిర్వహణ పద్ధతి, రోడ్డు భద్రతా నిబంధనల అమలు పరిస్థితులపై ఆయన అక్కడి సిబ్బందితో మాట్లాడారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి