రాయలసీమ న్యూస్ - తిరుపతి

తిరుపతి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడి ప్రవర్తనపై వివాదం

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడి నిర్లక్ష్య వైఖరి, రోగుల బంధువులతో దురుసు ప్రవర్తనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో రోగి చికిత్స ఆలస్యమైందని, వైద్యుడు మద్యం మత్తులో విధులకు హాజరయ్యాడని ఆరోపణలు చేస్తూ, ఆరోగ్య శాఖ అధికారులు దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తిరుపతి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడి ప్రవర్తనపై వివాదం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఒక వైద్యుడి ప్రవర్తన స్థానికంగా తీవ్ర విమర్శలకు గురవుతోంది. మంగళవారం రాత్రి అత్యవసర పరిస్థితిలో ఒక రోగిని అక్కడికి తీసుకెళ్లినప్పటికీ, వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో గంటపాటు వేచి చూడాల్సి వచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

రోగిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు, అక్కడ వైద్య సిబ్బంది సహకారం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు. వైద్యుడు ఆసుపత్రికి ఆలస్యంగా చేరుకోవడంతో రోగి చికిత్స ఆలస్యమైనట్టు వారు పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →