రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి
కదిరి దొరిగల్లు రిజర్వ్ అడవిలో వన్యప్రాణి వేటకు ప్రయత్నించిన ఏడుగురిని అటవీశాఖ అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ఆలువ, స్కూటర్, నాటు తుపాకీ, బుల్లెట్లు, గన్‌పౌడర్‌ను స్వాధీనం చేసుకుంది. కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించగా, అక్రమ వేటపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక నిఘాతో కఠిన చర్యలు కొనసాగిస్తామని కదిరి అటవీ క్షేత్రాధికారి డి.
దొరిగల్లు రిజర్వ్ అడవిలో వన్యప్రాణి వేట యత్నం భగ్నం కదిరి: ముదిగుబ్బ మండలం దొరిగల్లు ఈస్ట్ బీట్ పరిధిలోని దొరిగల్లు రిజర్వ్ అడవిలో వన్యప్రాణులను వేటాడేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పసంబావి ప్రాంతంలో వన్యప్రాణి వేట జరుగుతోందన్న సమాచారం అందడంతో కదిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అటవీశాఖ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వేటగాళ్లను పట్టుకున్నారు.
నార్పల మండలం రంగాపురానికి చెందిన రామాంజనేయులు, రాజేంద్రబాబు, కుళ్లాయప్ప, ఉమామహేష్, గంగన్న యాదవ్, బత్తలపల్లికి చెందిన ముత్యాలయ్య, ఆంజనేయులు అనే ఏడుగురిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. వీరు రిజర్వ్ అడవిలో అక్రమంగా ప్రవేశించి వన్యప్రాణులను వేటాడేందుకు సిద్ధమయ్యారని అధికారులు తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి