రాయలసీమ న్యూస్ - అన్నమయ్య

మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు – విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మాదకద్రవ్యాల నిర్మూలనపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో యువతను మత్తు ముప్పు నుంచి రక్షించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల అందుబాటును అరికట్టేందుకు హాస్టళ్లపై ప్రత్యేక నిఘా, 100 మీటర్ల పరిధిలో గుట్కా, సిగరెట్ల విక్రయాల నిషేధం, ఎన్‌డీపీఎస్, పీడీ యాక్ట్‌లతో కఠిన చర్యలు, ‘ఈగల్ క్లబ్స్’ ద్వారా అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్

మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు – విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మాదకద్రవ్యాల నిర్మూలనపై జిల్లా స్థాయి కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీ శివ్ నారాయణ శర్మ ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ మంగళవారం అధికారులతో కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించారు.

యువత భవిష్యత్తును మత్తు ముప్పు నుంచి రక్షించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని, ముఖ్యంగా విద్యార్థుల హాస్టళ్లపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని అధికారులు సూచనలు అందుకున్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →