రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
జనసేన నాయకుడు మాదాసు మురళీ డిఎస్సీ నియామకాలపై ప్రతిపక్షం లేవనెత్తుతున్న వివాదాలు రాజకీయ దృష్టి మళ్లింపుకే పరిమితమని విమర్శించారు. ఏడు నెలల క్రితమే పూర్తయిన నియామకాల విషయాన్ని ఇప్పుడు లేవనెత్తడం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయకుండా వాస్తవాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని ప్రతిపక్షాలకు ఆయన సూచించారు.
డిఎస్సీ నియామకాలపై ప్రతిపక్ష రాద్ధాంతం రాజకీయ దృష్టి మళ్లింపే: మాదాసు మురళీ ప్రొద్దుటూరు:- కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు డిఎస్సీ ఉద్యోగ నియామకాల అంశంపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళీ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం నందిని క్లాత్ మార్కెట్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల
డిఎస్సీ నిర్వహించి ఉద్యోగ నియామకాలు పూర్తి చేసి ఏడు నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షం ఈ అంశాన్ని లేవనెత్తడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు ఉపయోగపడే పరిపాలనను చూసి ఓర్వలేక, ఎప్పుడో పూర్తయిన ఉద్యోగ నియామకాలపై ఇప్పుడు కొత్తగా వివాదాలు సృష్టించడం కేవలం రాజకీయ దృష్టి మళ్లింపు ప్రయత్నమని మాదాసు మురళీ అభిప్రాయపడ్డారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి