రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆశించినంత వర్షపాతం నమోదు కాక, వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. సాగు సీజన్‌పై ప్రభావం ఉండే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని, రైతులు ఆందోళన చెందకుండా వాతావరణ, వ్యవసాయ శాఖల సూచనల ఆధారంగా సాగు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.
వర్షాలు తగ్గినా రైతులకు రక్షణ కవచం ప్రభుత్వం ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కీలక ప్రకటన చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షపాతం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రైతుల్లో నెలకొన్న ఆందోళనపై ఆయన స్పందించారు. ఎల్‌నినో కారణంగా వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని వరదరాజుల రెడ్డి వివరించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి