రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు MRO కార్యాలయంలో నకిలీ డి-పారాల కేసులో చెన్నంరాజుపల్లెకు చెందిన మేడం హజరయ్యను 3టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ నరేష్, నరేంద్రతో కలిసి నకిలీ పత్రాలు తయారు చేసి రిజిస్ట్రేషన్లు జరిపినట్టు దర్యాప్తులో బయటపడగా, సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకుని మరికొంతమంది ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు విస్తరిస్తున్నారు.
ప్రొద్దుటూరు MRO కార్యాలయంలో నకిలీ డి-పారాల కేసు: చెన్నంరాజుపల్లె వ్యక్తి అరెస్ట్ ప్రొద్దుటూరు MRO కార్యాలయంలో నకిలీ డి-పారాల కేసులో మరో అరెస్ట్ జరిగింది. చెన్నంరాజుపల్లెకు చెందిన మేడం హజరయ్యను స్థానిక 3టౌన్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు సంబంధించి విచారణ కొనసాగుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సీఐ రామాంజనేయుడు అందించిన సమాచారం ప్రకారం, ప్రొద్దుటూరు MRO కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ నరేష్ మరికొంతమందితో కలిసి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి