రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో నిర్వహించిన కిసాన్ మేళా–2026లో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, శాస్త్రీయ సాగు, యాంత్రీకరణపై విస్తృత అవగాహన కల్పించారు. ముఖ్య అతిథి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం, ఆదాయం పెంపు, సాంకేతిక సహకారం అందించడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని తెలిపారు.
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలంలో కిసాన్ మేళా–2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. గాలివీడు మండల వ్యవసాయ శాఖ అధికార కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులు, కాలానుగుణ సాగు మెలకువలు, శాస్త్రీయ విధానాలు, ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
రాయచోటి లో నిర్వహించిన ఈ మేళాకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రైతులతో మాట్లాడారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి