రాయలసీమ న్యూస్ తెలంగాణ డెస్క్

భద్రాచలం వద్ద గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చి, సమ్మక్క బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండగా, వాజేడు, వెంకటాపురం ప్రాంతాల్లో రహదారులు, వంతెనలపైకి వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి.

గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విపత్తుల నిర్వహణ శాఖ కోరుతోంది. భద్రాచలం వద్ద గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక భద్రాచలం: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.

శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయానికి గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. నీటి మట్టం పెరగడంతో భద్రాచలం వద్ద కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద నీటిలో మునిగిపోయాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →