రాయలసీమ న్యూస్ - అన్నమయ్య

శ్రీ గంగమ్మ ఆలయ చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ బాధ్యతల స్వీకారం

మదనపల్లె కనుములోని శ్రీ గంగమ్మ ఆలయ నూతన చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ శనివారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నాయకులు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం కృషి చేస్తానని గుట్ట వెంకటరమణ కృతజ్ఞతలు తెలుపుతూ తెలిపారు. శ్రీ గంగమ్మ ఆలయ చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ బాధ్యతల స్వీకారం మదనపల్లె: కనుములోని శ్రీ గంగమ్మ ఆలయ నూతన చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది.

ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకకు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు, ఆలయ భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, టీడీపీ సీనియర్ నాయకులు బాబు రెడ్డి, జనసేన పార్టీ రాయలసీమ కో–కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పాల్గొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →