రాయలసీమ న్యూస్ - అన్నమయ్య

చిన్నమండెం ఉర్దూ హైస్కూల్‌కు కంప్యూటర్లు విరాళం

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలోని చిన్నమండెం ఉర్దూ హైస్కూల్‌కు కంప్యూటర్ల కొరత ఉండటంతో, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ తన సొంత నిధులతో కంప్యూటర్లు అందజేశారు. దీంతో అక్కడి విద్యార్థులకు డిజిటల్ విద్యాభ్యాసం, కంప్యూటర్ ప్రాక్టికల్ శిక్షణకు అనుకూల వాతావరణం ఏర్పడిందని ఉపాధ్యాయులు, స్థానికులు అభినందిస్తున్నారు.

చిన్నమండెం ఉర్దూ హైస్కూల్‌కు కంప్యూటర్లు విరాళంగా అందించిన మంత్రి సతీమణి హరితమ్మ అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో విద్యార్థుల డిజిటల్ విద్యాభ్యాసానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ చేయూతనందించారు. చిన్నమండెం ఉర్దూ హైస్కూల్‌లో కంప్యూటర్ల కొరత ఉన్న విషయాన్ని స్థానికులు ఆమె దృష్టికి తీసుకురావడంతో, హరితమ్మ తన సొంత నిధులతో కంప్యూటర్లను అందజేశారు.

ఉర్దూ హైస్కూల్ విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వెనుకబడకుండా, పోటీ ప్రపంచంలో ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్న హరితమ్మ, ఎలాంటి ఆలస్యం చేయకుండా కంప్యూటర్ల కొనుగోలు చర్యలు చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. ఆమె అందజేసిన కంప్యూటర్లతో విద్యార్థులు డిజిటల్ విద్యను సులభంగా అభ్యసించే అవకాశం కలిగిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →