రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి
పుట్టపర్తి జిల్లా హిందూపురంలో మాతృశ్రీ హాస్పిటల్‌లో మహిళ మృతి ఘటనపై న్యాయం కోరుతూ ధర్నా చేస్తున్న హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణపై సీఐ రాజగోపాల్ నాయుడు దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఐను తక్షణ సస్పెండ్ చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
హిందూపురం సీఐ రాజగోపాల్ నాయుడు దురుసు ప్రవర్తనపై దళిత సంఘాల ఆగ్రహం పుట్టపర్తి జిల్లా హిందూపురంలో సీఐ రాజగోపాల్ నాయుడు ప్రవర్తన చుట్టూ వివాదం చెలరేగింది. బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణపై ఆయన దురుసుగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హిందూపురం మాతృశ్రీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఒక మహిళ మృతి చెందడంతో, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ ధర్నా చేపట్టారు. ఈ ధర్నా సందర్భంగా సీఐ రాజగోపాల్ నాయుడు అక్కడికి చేరుకుని శివరామకృష్ణతో ఘర్షణకు దిగినట్లు సమాచారం.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి