రాయలసీమ న్యూస్ స్పోర్ట్స్ డెస్క్

కొరియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత ఆటగాళ్ల మిశ్రమ ఫలితాలు

కొరియా మాస్టర్స్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌తో పాటు తరుణ్‌ మన్నెపల్లి, కిరణ్‌ జార్జ్‌, మిథున్‌ మంజునాథ్‌, రౌనక్‌ మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించగా, మహిళల సింగిల్స్‌లో తన్వి శర్మ, రక్షిత రామ్‌రాజ్‌, ఇషారాణి బారువా, అన్మోల్‌ ఖర్బ్‌, అస్మిత చాలిహా, శ్రియాంశి వలిశెట్టి రెండో రౌండ్‌లకు చేరుకున్నారు.

మహిళల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ భారత జోడీలు విజయాలతో ముందుకు సాగుతూ టోర్నీలో భారత ఆశలను నిలబెట్టాయి. కొరియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత ఆటగాళ్ల మిశ్రమ ఫలితాలు కొరియా మాస్టర్స్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి.

పురుషుల సింగిల్స్‌లో ప్రముఖ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ తొలి రౌండ్లోనే నిష్క్రమించగా, మహిళల విభాగంలో తన్వి శర్మతో పాటు పలువురు భారత క్రీడాకారిణులు రెండో రౌండ్లకు ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్‌గా బరిలో దిగిన కిదాంబి శ్రీకాంత్‌ తన తొలి మ్యాచ్‌లో డానియిల్‌ డుబోవెంకో (ఇజ్రాయెల్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →