రాయలసీమ న్యూస్ నేషనల్ డెస్క్

మహారాష్ట్రలో ఘోరం.. ఐఫోన్ వివాదంతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా తిస్‌గావ్ సమీపంలోని ఖవ్ద్యా డోంగర్ కొండపై ఐఫోన్ ఈఎమ్‌ఐ వివాదం దారుణానికి దారి తీసింది. ఐఫోన్ కొనుగోలు, ఈఎమ్‌ఐ చెల్లింపులపై ఇంట్లో తలెత్తిన వాగ్వాదం అనంతరం 18 ఏళ్ల కునాల్ చాంద్‌వాడే ఆత్మహత్యకు యత్నించగా, అతడిని కాపాడే ప్రయత్నంలో తండ్రి మురళీధర్, ఆవేదనతో తల్లి సంగీత కూడా లోయలో పడిపోవడంతో ముగ్గురూ మృతి చెందారు.

ఐఫోన్ వివాదంతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి ఛత్రపతి శంభాజీనగర్: ఐఫోన్ కొనుగోలు, దానికి సంబంధించిన ఈఎమ్‌ఐ చెల్లింపులపై తలెత్తిన వివాదం మహారాష్ట్రలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని తిస్‌గావ్ సమీపంలో ఉన్న ఖవ్ద్యా డోంగర్ కొండపై శుక్రవారం మధ్యాహ్నం ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో 18 ఏళ్ల కునాల్ చాంద్‌వాడే, అతని తండ్రి మురళీధర్ చాంద్‌వాడే, తల్లి సంగీత చాంద్‌వాడే మృతి చెందారు. ముగ్గురి మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →