రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన జనసేన ఇన్‌చార్జ్ పసుపులేటి హరిప్రసాద్, అక్టోబర్ 13–18 మధ్య మంగళగిరి, అమరావతిలో జరగనున్న 9వ జాతీయ టీ–20 దివ్యాంగుల క్రికెట్ ఛాంపియన్‌షిప్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. దివ్యాంగ క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి రావడానికి ఇలాంటి జాతీయ స్థాయి పోటీలు దోహదం చేస్తాయని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు.
దివ్యాంగుల జాతీయ టీ–20 క్రికెట్‌కు రావాలంటూ మంత్రికి జనసేన నేత ఆహ్వానం తిరుపతి : రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని 9వ జాతీయ టీ–20 దివ్యాంగుల క్రికెట్ ఛాంపియన్‌షిప్‌కు ఆహ్వానిస్తూ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి లోని పద్మావతి గెస్ట్‌హౌస్‌లో ఈ భేటీ జరిగింది.
బోర్డ్ ఆఫ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్–ఇండియా, ఆంధ్రప్రదేశ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న 9వ జాతీయ టీ–20 క్రికెట్ ఛాంపియన్‌షిప్–2026 వివరాలను హరిప్రసాద్ మంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌కు సంబంధించిన పోస్టర్‌ను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అందజేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి