రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప నగర శివారులో సుమారు రూ.12 కోట్ల విలువైన భూములను నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్‌రెడ్డి సహా వీఆర్వో, సబ్ రిజిస్ట్రార్‌లతో కలిసి మొత్తం తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో సీకే దిన్నె తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో ఈ భూముల రిజిస్ట్రేషన్ జరిగిందని ఆరోపణల నేపథ్యంలో, సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకుని నకిలీ సర్టిఫికెట
కడప డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు కడప జిల్లాలో కోట్ల విలువైన భూములను నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జిల్లా డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మందిని కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు.
నిందితుల్లో వీఆర్వో, సబ్ రిజిస్ట్రార్‌లు ఉన్నట్లు సమాచారం. కడప నగర శివారులో సుమారు రూ.12 కోట్ల విలువైన భూమిని నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా వేరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ చేసిన ఘటనపై విచారణ జరిపిన పోలీసులు, ఇందులో డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి