రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప నగరంలో, ముఖ్యంగా 15వ డివిజన్ సాగర్ కాలనీలో వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. CPI ఆధ్వర్యంలో కాలనీవాసులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన చేపట్టి, మున్సిపల్ యంత్రాంగం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శిస్తూ తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కడపలో మంచినీటి సమస్య తీవ్రం: CPI నిరసన కడప నగరంలో మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా పేద ప్రజలు తాగునీటి కోసం తీవ్రంగా అల్లాడుతున్న పరిస్థితి నెలకొంది.
కనీసం తాగడానికి ఉప్పునీరు కూడా వారం రోజులుగా సరఫరా కాకపోవడం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ఘోర వైఫల్యానికి నిదర్శనమని CPI కడప నగర కార్యదర్శి ఎన్. వెంకటశివ తీవ్రంగా విమర్శించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి