రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప–మైదుకూరు జాతీయ రహదారిపై పాత టోల్‌గేట్ సమీపంలో కారు, నిలిచిన లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను RIMS ఆసుపత్రికి తరలించగా, వారి వివరాలు, మృతుడి గుర్తింపు, ప్రమాదానికి గల కారణాలపై మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కడప–మైదుకూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం మైదుకూరు: కడప–మైదుకూరు జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాత టోల్‌గేట్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల సమాచారం మేరకు హైదరాబాద్ నుండి తిరుపతి వైపు ప్రయాణిస్తున్న కారు, జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి